హైదరాబాద్ రహదారిలో ఘోర ప్రమాదం

0
187

[XRAY NEWS] విజయవాడ – హైదరాబాద్ రహదారిలో ఘోర ప్రమాదం.. చితికిపోయిన శరీరాలు
21 May. 2019 16:16

చౌటుప్పల్‌ గ్రామీణం: హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌ మండలంలోని పంతంగి టోల్‌ ప్లాజా వద్ద ఇవాళ వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో పది మందికి తీవ్రగాయాలయ్యాయి. విజయవాడ నుంచి హైదరాబాద్‌ వైపు వెళుతున్న విజయవాడ డిపోకి చెందిన ఆర్టీసీ సూపర్‌ లగ్జరీ బస్సు పంతంగి టోల్‌ ప్లాజా వద్దకు రాగానే ముందున్న వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కృష్ణా జిల్లాకు చెందిన బస్సు డ్రైవర్‌ శ్రీనివాసరావు అక్కడికక్కడే మృతి చెందాడు. బస్సులో ప్రయాణిస్తున్న మరో పది మంది ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే ముందున్న వాహన డ్రైవర్‌ అప్రమత్తమై ఘటనా స్థలం నుంచి వాహనం తీసుకొని పరారయ్యాడు. చౌటుప్పల్‌ సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై నవీన్‌ బాబు ఘటనా స్థలికి చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించేందుకు టోల్‌ ప్లాజా వద్ద ఉన్న సీసీ టీవీ పుటేజీలను పరిశీలిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here