టీమిండియా ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి ప్రశంసలు కురిపించాడు

0
99

x-ray news 07-17-19 న్యూఢిల్లీ: న్యూజిలాండ్‌ క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌పై టీమిండియా ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి ప్రశంసలు కురిపించాడు. విలియమ్సన్‌ నాయకత్వాన్ని, హుందాతనాన్ని మెచ్చుకున్నాడు. దురదృష్టవశాత్తు ప్రపంచకప్‌ చేజారినప్పటికీ కివీస్‌ కెప్టెన్‌ గౌరవంగా ఫలితాన్ని అంగీకరించి క్రీడాస్ఫూర్తిని చాటాడని పేర్కొన్నాడు. ‘క్లిష్టపరిస్థితుల్లోనూ నువ్వు చూపిన సహనం, గౌరవం ప్రశంసాయోగ‍్యం. తుది సమరం ముగిసిన తర్వాత 48 గంటల పాటు నువ్వు పాటించిన మౌనం అపూర్వం. ప్రపంచకప్‌ టైటిల్‌ తృటిలో చేజారినప్పటికీ మా దృష్టిలో మీరు కూడా విజేతలే. నువ్వు సమర్థుడైన ఆటగాడివి’ అంటూ రవిశాస్త్రి ట్వీట్‌ చేశాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here