చర్ల మండలం ఆర్. కొత్తగూడెం గ్రామం ప్రధాన రహదారి బీటి రోడ్డుపై వర్షపు నీరు

0
132

x-ray news ఆర్ అండ్ బి బిటి రోడ్డు పై నిల్వ ఉన్న వర్షపు నీరు. పట్టించుకోని ఆర్ అండ్ బి అధికారులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం ఆర్. కొత్తగూడెం గ్రామం ప్రధాన సెంటర్లో ప్రధాన రహదారి బీటి రోడ్డుపై వర్షపు నీరు నిల్వ ఉండి వచ్చిపోయే వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డు పక్కన వ్యాపార సంస్థల వారు మట్టి ఎత్తుగా పోయడంతో నీళ్లు వెళ్లే అవకాశం లేక నీళ్లు రోడ్డుపై నిల్వ ఉన్నాయని దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన రహదారి సెంటర్ అవడంతో ఎప్పుడూ రద్దీగా ఉండే రోడ్డుపై ప్రమాదం పొంచి ఉందని స్థానికులు భావిస్తున్నారు. తక్షణమే ఆర్ అండ్ బి అధికారులు రోడ్డుపై నిల్వ ఉన్న నీటిని తొలగించేలా తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here