12వ వేతన ఒప్పందం జాప్యం చేయకుండా త్వరగా ముగించాలని జేఏసీ ఆధ్వర్యంలో మహాధర్నా

0
121

x-ray news 29-08-19 ఐటీసీ పి ఎస్ పి డి యూనిట్ భద్రాచలం నందు 12వ వేతన ఒప్పంద జాప్యాన్ని నిరసిస్తూ జేఏసీ ఆధ్వర్యంలో గత నాలుగు నెలల నుండి అనేక కార్యక్రమాలు చేస్తూ గురువారం నాడు ఉదయం 7 గంటల 30 నిమిషాల నుండి 9 గంటల వరకు అడ్మిన్ బ్లాక్ ఆవరణ యందు కార్మికులందరూ స్వచ్ఛందంగా తమ విధులను సైతం బహిష్కరించి మహాధర్నాలో పాల్గొనటం జరిగింది.
కార్మికులకు15,000 రూపాయలు తగ్గకుండా వేతనాలు పెరగాలని, కాంట్రాక్ట్ వర్కర్లకు నెలకు 18 వేల రూపాయల వేతనం రావాలని 12వ వేతన ఒప్పందం జాప్యం చేయకుండా త్వరగా ముగించాలని జేఏసీ ఆధ్వర్యంలో మహాధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ హరి ప్రసాద్ సహా కన్వీనర్లు మొహమ్మద్ అబ్దుల్ సాబీర్, గాదె రామ్ కోటి రెడ్డి, నాగభూషణం మరియు ఇతర కార్మికులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here