కాసేపట్లో తెలంగాణ బడ్జెట్ సమావేశాలు.

0
146

కాసేపట్లో తెలంగాణ బడ్జెట్ సమావేశాలు.🔥🔥
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. సోమవారం ఉదయం11.30 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతాయి. సోమవారం అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. మండలిలో బడ్జెట్‌ను ఆర్థికమంత్రి హరీష్‌రావు ప్రవేశపెడతారు. మార్చి నెలలో ఆరు నెలల కాలానికి ఆమోదం పొందిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కాలపరిమితి ఈ నెలాఖరుతో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో అక్టోబర్ నుంచి మార్చి నెలాఖరు వరకు ప్రతిపాదించిన ఈ బడ్జెట్‌కు ఉభయసభలు ఆమోదం తెలుపనున్నాయి.
తెలంగాణ రాష్ట్రం ఆర్థిక సంవత్సరం మధ్యలోనే నిధులకు తీవ్ర కటకట నెలకొంది. అన్ని శాఖల్లో రూ.27,535 కోట్ల బిల్లులు పెండింగ్‌‌లో ఉన్నాయి. ఒక్క సాగునీటి శాఖకే రూ.10 వేల కోట్ల బకాయిలున్నాయి. రోజుకు రూ.50 కోట్లకు మించి చెల్లింపులు లేవని అధికారులు చెబుతున్నారు. ఐజీ ఎస్టీ నిధులు వస్తేనే బిల్లుల క్లియరెన్స్‌ అవుతుందని ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి. మరోవైపు కొత్త హామీలకు నిధుల మంజూరు సవాలుగా మారింది. మార్చిలో మొత్తం రూ. 1,82,017 కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
జడ్జెట్ సమావేశాలకు ముందు టీఆర్‌ఎస్‌ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండోదఫా కేబినెట్‌‌ను విస్తరించారు. గత ఏడాది డిసెంబరు 13న సీఎంగా కేసీఆర్‌, మంత్రిగా మహమూద్‌ అలీ ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరి 19న మరో 10 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మిగిలి ఉన్న ఆరు ఖాళీలను ఆదివారం భర్తీ చేశారు. టీఆర్‌ఎస్‌ తొలి ప్రభుత్వంలోనూ రెండుసార్లు కేబినెట్‌ విస్తరణ జరిగింది. అప్పట్లో తొలుత 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత మిగిలిన ఆరు స్థానాలను భర్తీ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here