భద్రాచలం వద్ద నిలకడగా వున్నా గోదావరి .ప్రస్తుతం 51 .2

0
124

x-ray news 09-09-19 భద్రాచలం వద్ద నిలకడగా వున్నా గోదావరి .ప్రస్తుతం 51 .2 అడుగులు ఉన్న గోదావరి.గోదారమ్మ పరవళ్లు తొక్కుతుంది … పంటపొలాలు నీటమునిగాయి..రైతుల కళ్ళల్లో కన్నీళ్లు మిగిలాయి.
లోతట్టు గ్రామాలూ జలమయం అయ్యాయి.. పలు గ్రామాలకు రహదారులు సౌకర్యం కట్ అయ్యాయి…
నిన్నటివరకు పరవళ్లు తోక్కిన గోదారమ్మ.. ఈరోజు శాంతించినట్లు కనిపిస్తుంది … రాత్రి నుంచి గోదావరి నిలకడగా ఉండటంతో ఏజెన్సీ ప్రజలలో కొద్దిమేర టెన్షన్ తగ్గింది. నిన్నటి ప్రవాహం ఈరోజు కూడా ప్రవహిస్తే అధిక నష్టం వాటిల్లేది.ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నిలకడగా వుంది . ఏటూరునాగారం వద్ద తగ్గుమొహం పట్టినట్లు తెలుస్తుంది .అధికారులు లోతట్టు ప్రజలకు ఎటువంటి ఇబ్బంద్దులు పడకుండా అన్ని ఎరపాట్లు చేస్తున్నట్లు చెప్పుతున్నారు .. కాళేశ్వరం , పాతగూడెం , ఏటూరునాగారం వద్ద గోదావరి వరద తగ్గుమొహం పట్టినట్లు అధికారులు చెప్తున్నారు . దీనిని బట్టి చుస్తే భద్రాచలం వద్ద ఈరోజు రాత్రికి రెండొవ ప్రమాద హెచ్చరికను రద్దు చేయనున్నట్లు తెలుస్తుంది…ఇది గోదావరి ప్రవాహ ప్రస్తుత పరిస్థితి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here