అమెర్ద పంచాయతీ గ్రామ సభలో తీవ్ర ఉత్కంఠ

0
158

x-ray news 11-09-19 భధ్రాద్రికొత్తగూడెం జిల్లా,అశ్వాపురం మండలం. అమెర్ద పంచాయతీ గ్రామ సభలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. డబల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల జాబితా సరైనది కాదని, ఎస్టీ వాళ్ళతో పాటు ఎస్సీ, బీసీలకు కూడ డబుల్ బెడ్ రూమ్ లు కేటాయించాలని వివిధ పార్టీల నాయకులు, గ్రామస్తులు డిమాండ్ చేస్తూ వినతిపత్రం సమర్పించడంతో డబుల్ బెడ్ రూమ్ లబ్దిదారుల జాబితా వాయిదా వెయ్యడం జరిగింది. వివరాల్లోకి వెళితే అశ్వాపురం తహసిల్దార్ రమాదేవి, ఆర్ఐ తిరుపతిరావు, సర్పంచ్ బండ్ల సీతమ్మ అధ్యక్షతన అమెర్ద పంచాయతీ గ్రామ సభ నిర్వహించారు. తహసిల్దార్ రమాదేవి మాట్లాడుతూ అమెర్ద మరియు సండ్రలబోడు పంచాయితీలలో పాయింట్ల ప్రకారం సర్వేలు నిర్వహించి, 40 మంది ఎస్టీ లబ్ధిదారులను ఎన్నిక చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా ఇల్లులేని పేదలు ఉంటే ధరఖాస్తు మరియు 40 మంది లబ్దిదారుల పై మీకు ఏమైనా సందేహాలు అనుమానాలు ఉంటే మాకు తెలియపర్చగలరు అని అన్నారు. దీనిపై స్పందించిన సిపిఐ మండల కార్యదర్శి అనంతరం సురేష్ మాట్లాడుతూ ఈ 40 మంది లబ్ధిదారులలో ఇందిరమ్మ గృహాలు ఉన్న వాళ్లను కూడా చేర్చారు. ఎస్టీ వాళ్ళతో పాటు ఎస్సీ బీసీలకు కేటాయించాలని గతంలో కూడా పంచాయతీ తీర్మానం చేసి ఇచ్చాము. అయినా కూడా పంచాయతీ తీర్మానం పట్టించుకోకుండా, డబుల్ బెడ్ రూమ్ లు వద్దు అన్నవారిని, ఇందిరమ్మ గృహాలు ఉన్న వాళ్ళని లబ్ధిదారుల జాబితాలో చేర్చడం సరైన పద్ధతి కాదు. పాయింట్ల ప్రకారం లబ్దిదారులను కేటాయిస్తున్నమని చెప్పిన అధికారులకు, అవే పాయింట్ల ప్రకారం ఇళ్ళు లేని పేదవారు ఇంకా మిగిలి ఉన్నారు. 40 మంది లబ్దిదారుల జాబితాతో పాటు మిగిలిన వాళ్ళ జాబితా ఎక్కడ ఉంది అని ప్రశ్నించారు. మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు నేలపట్ల సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ పాయింట్ల ప్రకారం ఎస్టీ, ఎస్సీ, బిసిల పూర్తి జాబితా సిద్దం చేసి గ్రామ సభ నిర్వహించాలని, జిల్లా స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్తామని, లబ్ధిదారుల జాబితా సరైనది కాదని, ఎస్టితో పాటు ఎస్సీ, బీసీలకు కూడా న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సండ్రలబోడు మరియు అమెర్ద పంచాయితీ సర్పంచ్ లు, వార్డ్ మెంబర్లు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు తదితరులు భారి ఎత్తున పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here