కంచుకోటలో గులాబి జెండా విజయం

0
187

24-10-19 x-ray news నల్గోండ జిల్లా :యావత్తు తెలంగాణ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తోన్న హుజూర్‌నగర్ ఉపఎన్నికల ఓట్ల లెక్కింపులో అధికార టీఆర్ఎస్ పార్టీ రికార్డ్ బ్రేక్ చేసింది.  హుజూర్ నగర్ లో అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తన భారీ అధిక్యతను నిరూపించుకోవడంతో  సైదిరెడ్డి ఇళ్లు, కార్యాలయం సహా పార్టీ కార్యాలయంలోనూ కార్యకర్తలు స్వీట్లు పంచుకున్నారు. ఆయన మద్దతుదారులు సంబరాలు ప్రారంభించారు. తాను ముందుగా చెప్పినట్టుగానే బంపర్ మెజారిటీతో విజయాన్ని సొంతం చేసుకోనున్నానని ఈ సందర్భంగా సైదిరెడ్డి వ్యాఖ్యానించారు.  ఓట్ల లెక్కింపు ముగిసిన తరువాత సైదిరెడ్డి ఏకంగా 43 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here