చే’జారిన హుజూర్ నగర్..

0
174

24-10-19 X-RAY NEWS నల్గోండ జిల్లా: తెలంగాణ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తోన్న హుజూర్‌నగర్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపులో అధికార టీఆర్ఎస్ పార్టీ రికార్డ్ బ్రేక్ చేసింది. గత నాలుగు పర్యాయాలుగా ఇక్కడి నుంచి బరిలో నిలిచి పిసిసి అధ్యక్ష పదవిని అందుకున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ సారి ఓటమిని చవిచూడక తప్పలేదు. రమారమి ఏడాది క్రితం జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ఈ స్థానం నుంచి గెలుపోందిన ఉత్తమ్. ఆ తరువాత వచ్చిన సార్వత్రిక ఎన్నికలలో పార్లమెంటు సభ్యుడిగా కూడా ఎన్నికయ్యాడు. దీంతో ఈ స్థానంలో ఉప ఎన్నిక తప్పలేదు.అయితే తానే పీసీసీ అధ్యక్షుడు కావడంతో వచ్చిన అవకాశాన్ని తన సతీమణి పద్మావతికి అందించాడు. ఏడాది క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఆమె పోటీ చేసి ఓటమి పాలయ్యారు. దీంతో అమెను అభ్యర్థిగా ప్రకటించిన ఆయన. అమె అదృష్టాన్ని మరోసారి పరీక్షించాడు. అయితే ఏడాది క్రితం రిపీట్ అయిన ఫలితమే మరోమారు పునరావృతం అయ్యాయి. హుజూర్ నగర్ ను తన ఖిల్లాగా మార్చుకున్న ఉత్తమ్. అందులోనూ దశాబ్దాలుగా కాంగ్రెస్ కు అనుకూలంగా వున్న నల్గోండ జిల్లా. ఈ ఉపఎన్నికలో మారిపోయింది.ఇవాళ సూర్యాపేటలోని కొత్త వ్యవసాయ మార్కెట్టు గొడౌన్ లో లెక్కింపు ప్రారంభమైంది. తొలి రౌండ్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి ఆధిక్యంలో వున్నారు.  కాంగ్రెస్ కంచుకోటలో గులాబి జెండా రెపరెపలాడటంతో. బరిలో నిలిచిన కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. తమ అంచనాలు తారుమారయ్యాయని. తమ ఖిల్లాలో ప్రత్యర్థి జెండా ఎలా ఎగురుతుందన్న దానిపై మేధోమధనం చేయనుంది కాంగ్రెస్. ప్రజలందరూ ఆర్టీసీ సమ్మె విషయంలో ప్రభుత్వం పక్షాన నిలిచారా. లేక గులాబీ బాస్‌ మీదనే మరోసారి నమ్మకం ఉంచి ఓటేశారా అనే దానిపై ఇప్పుడు రాజకీయంగా చర్చ సాగుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here