జనవరిలో 85 కేసులు ఉంటే అక్టోబర్ నాటికి 3800 కేసులు ఎలా పెరిగాయి

0
170

 x-ray news  25-10-19   ఏసీ రూముల్లో కూర్చొని  తమాషా చేస్తున్నారా అని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.  డెంగ్యూ మరణాలు నివారణ చర్యలపై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది.  తెలంగాణ చీఫ్ సెక్రెటరీ, ప్రిన్సిపల్ సెక్రెటరీస్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఉన్నత న్యాయస్థానం ముందు హాజరయ్యారు.  3800 కేసులు నమోదైతే ప్రభుత్వం తక్కువ కేసులు చూపెడుతోందని   హైకోర్టు  వ్యాఖ్యానించింది. చీఫ్ సెక్రెటరీతో పాటు అధికారులందరూ మూసి నదిని పరిశీలించాలని కోర్టు ఆదేశించింది. డెంగ్యూ వ్యాధి నివారణలో ప్రభుత్వం విఫలమైతే మృతుల కుటుంబాలకు రూ. 50 లక్షలు చెల్లించాలని, అధికారుల నిర్లక్ష్యానికి ఎవరైనా మరణిస్తే,ఐఏఎస్‌లదే బాధ్యత అని హైకోర్ట్ పేర్కొంది. కోట్లు ఖర్చుపెట్టి శిక్షణ ఇచ్చి ఐఏఎస్‌లను చేస్తే మీరు సామాన్య ప్రజలకు ఏం సేవ చేస్తున్నారంటూ హైకోర్టు ప్రశ్నించింది. కోర్ట్ ఆదేశాలను పాటిచకుంటే ఐఏఎస్‌లపై సుమోటో కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించింది. మరణించిన కుటుంబానికి రూ.5 లక్షల రూపాయలు ఐఏఎస్‌లు సొంత అకౌంట్ నుంచి చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది.  రాజస్థాన్, మధ్యప్రదేశ్ కూడా నది మధ్యలోనే ఉన్నాయని. అక్కడ లేని డెంగ్యూ మరణాలు ఇక్కడ ఎందుకు ఉన్నాయని హైకోర్టు ప్రశ్నించింది. మూసీని ఆనుకోని ఉన్న హైకోర్ట్‌లోనే దోమలు ఉన్నాయని , జనవరిలో 85 కేసులు ఉంటే అక్టోబర్ నాటికి 3800 కేసులు ఎలా పెరిగాయని కోర్టు ప్రశ్నించింది. సీఎస్ లెక్కలపై కోర్ట్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here