విజ్ఞాన కేంద్రంలో రాజకీయ జేఏసీ సమావేశం

0
134

x-ray news 25-10-19 ఆర్టీసీ సంస్థ నష్టాలకు కారణం కార్మికులే  అనడం దారుణమన్నారు. ఆర్టీసీ అంశంపై  విజ్ఞాన కేంద్రంలో రాజకీయ జేఏసీ సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో అఖిలపక్ష నాయకులు పాల్గొన్నారు.   ముఖ్యమంత్రి  కేసీఆర్‌ వీధి నాయకుడి మాదిరిగా మాట్లాడారని తెలంగాణ జన సమితి అధినేత కోదండరామ్  మండిపడ్డారు.  మీడియా సమావేశంలో అన్ని అసత్యాలు, అర్ధ సత్యాలే మాట్లాడారని విమర్శించారు. పేదవారి రవాణాకు ఆర్టీసీ తప్ప వేరే మార్గం లేదని, ప్రజల పట్ల ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన హితవు పలికారు.ఆర్టీసీ కార్మికుల  నిరసనలో భాగంగా మా పై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారని కోదండరామ్ తెలిపారు. ఆర్టీసీ క్రాస్ రోడ్డులో అరెస్టు సందర్భంగా జరిగిన దాడిని ఖండిస్తున్నామని పేర్కొన్నారు. సమ్మెను మరింత ముందుకు తీసుకెళ్తామని  కార్మికులకు అండగా ఉంటామని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కల్పించేందుకు కార్యాచరణ సిద్దం చేస్తున్నామని తెలిపారు.ద్రోణాచార్యుడు ఏకలవ్యుడి బొటన వేలు గురుదక్షిణగా తీసుకున్నట్టు, దొర కేసీఆర్‌ కుట్రపూరితంగా నిదక్షిణగా రంగారావు వేలు తీసుకున్నారు. సీపీఐ ఎంఎల్‌ (న్యూ డెమోక్రసీ) కేసీఆర్‌తో కలిసి పోరాటం చేసిన పార్టీ. ఉద్యమ సమయంలో ఖమ్మం ఆస్పత్రిలో కేసీఆర్‌కు అండగా ఉన్నది పోటు రంగారావే అని తమ్మినేని వీరభద్రం అన్నారు. ముఖ్యమంత్రి బాధ్యతారాహిత్యంగా, కోర్టు మాటలు పట్టించుకునే అవసరం లేనట్టు మాట్లాడారు. యూనియన్లను సహించం, దరఖాస్తులు చేసుకుంటే ఉద్యోగులను చేర్చుకోవడంపై ఆలోచిస్తా  అంటు, హుజూర్‌నగర్ ఉపఎన్నిక విజయంతోనే ఆయన గర్వంతో మాట్లాడుతున్నారు. యూనియన్లు నన్నేమీ చేయలేరు అన్నట్టుగా మాట్లాడారు అని తమ్మినేని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here